నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
నేరాల నియంత్రణకు శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెర్మల్ తెలిపారు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జెమిని ఎడిబిల్స్ ఫ్యాట్స్ సహకారంతో బోయిన్ పల్లి లోని ప్రధాన రహదారులతో పాటు కూడళ్ల వద్ద నూతనంగా 123 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్,జెమిని ఎడిబిల్స్ ఫ్యాట్స్ సంస్థ ప్రతినిధులు నూతనంగా ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసు సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల మూలంగా నేరాలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స్వయంగా నెంబర్ ప్లేట్లను గుర్తించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సీసీ కెమెరాలను అమర్చడంతో పాటు వాటి నిర్వహణ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని మూడు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగించినట్లు తెలిపారు. ఉత్తర మండల పరిధిలో ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సీసీ కెమెరాలను అమర్చడంలో కృషి చేసిన బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, డిఐ సర్దార్ సింగ్, అడ్మిన్ ఎస్ఐ శివశంకర్ ల పాత్ర కీలకమని డిసిపి అభినందించారు.
బైట్.. రష్మీ పెరుమాళ్.. ఉత్తర మండల డిసిపి