పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు: మరియం 

By Ravi
On
పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు: మరియం 

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు నిరంతరం బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరని అన్నారు. మన రాజకీయ సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ.. బాహ్య దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ దళాల వెనుక ఉక్కు గోడలా మనం ఐక్యంగా ఉండాలి అని ఆమె అన్నారు.

పాకిస్తాన్ బలం దాని అమరవీరుల త్యాగాల నుంచి వచ్చింది అని మరియం అన్నారు. పాకిస్తాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో తన తండ్రి కృషి ఉందని చెప్పింది. పాకిస్తాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో నవాజ్ షరీఫ్ చారిత్రాత్మక పాత్ర పోషించారని ఆమె అన్నారు. అయితే, నవాజ్ షరీఫ్ కూడా ఇంకా పహల్గామ్ దాడిని ఖండించలేదు. ఈ అంశంపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Latest News

పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..! పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
రంగారెడ్డి TPN : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విశ్ర విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు.  43 మంది విద్యార్థులలో...
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..
కార్నీ వాల్‌.. కెనడా ప్రధాని డ్యాన్స్‌..
దేశాన్ని వీడిన 786 మంది పాక్‌ పౌరులు..
పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు: మరియం