కార్నీ వాల్.. కెనడా ప్రధాని డ్యాన్స్..
కెనడా పార్లమెంటు ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకే ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈనేపథ్యంలో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఈక్రమంలోనే ఓ కార్యక్రమంలో కార్నీ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మొత్తం 343 సీట్లున్న పార్లమెంటులో కార్నీ నేతృత్వంలోని ఆ పార్టీకి 168 సీట్లు దక్కాయి. ఈక్రమంలోనే కార్నీతో పాటు పార్టీ నేతలంతా సంబరాలు చేసుకున్నారు. రాప్ అండ్ రాక్ బ్యాండ్ డౌన్ విత్ వెబ్‌స్టర్ లో నిర్వహించిన విన్నింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అందులో డిడబ్ల్యూడబ్ల్యూ హుడీ ధరించిన కార్నీ టైమ్ టు విన్ పాటకు అక్కడి వారితో కలిసి స్టెప్పులేశారు.
ఇదిలా ఉండగా.. ప్రధాని కార్నీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని కార్నీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. త్వరలోనే వీరువురు నేతలు వ్యక్తిగతంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇరుదేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వీరు చర్చిస్తారు అని కూడా ఈ కీలక ప్రకటనలో తెలిపింది.