ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తున్న ఆందోళనలు..

By Ravi
On
ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తున్న ఆందోళనలు..

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నివాసం ఉంటున్న ఎన్ఆర్ఐలు తీవ్ర నిరసనలు చేపట్టారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఎన్నారైలు జాతీయ జెండాలు చేత పట్టి నిరసనలు తెలిపారు. 400 మందికిపైగా కాశ్మీరీ పండితులు, మిత్రులు, స్నేహితులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా గళమెత్తారు. అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్‌లో ఇండియన్స్ రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు జేశారు. ఇలా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా నిరసనలు తెలిపారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా పహల్గామ్ ఉగ్ర దాడిలో చనిపోయిన 26 కుటుంబాలకు న్యాయం జరగాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Latest News

సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆస్పత్రి నుండి  శ్రీ తేజ్ డిశ్చార్జ్ సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆస్పత్రి నుండి శ్రీ తేజ్ డిశ్చార్జ్
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల...
హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్
యాదాద్రి కాటపల్లి ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. నలుగురికి గాయాలు
ఉద్యమకారులపై జులుం  చెలాయిస్తే ఊరుకునేది లేదు..
వరి ధాన్యం రైతుల  అవస్థలు..
జాతీయ పతాకం కోసం ప్రాణాలర్పించిన సామా జగన్‌మోహన్ రెడ్డికి నివాళ్లు..
ఈత చెట్టుపై పిడుగు..