వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్ చేసిన యువకుడు..!
By Ravi
On
హైదరాబాద్ కుషాయిగూడలో ఓ యువకుడు కిరాతకానికి పాల్పడ్డాడు. 70 ఏళ్ల వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్స్ చేశాడు. మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. సెల్ఫీ వీడియోలని తన మిత్రులందరికీ షేర్ చేశాడు. ఒంటరిగా ఉంటున్న కమల అనే వృద్ధురాలిని ఉరివేసి హత్య చేశాడు. కమలాదేవికి చెందిన భవనంలో సదరు యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అద్దె విషయంలో యువకుడ్ని కమలాదేవి మందలించడంతో కక్ష పెంచుకున్నాడు. ఈనెల 11వ తేదీన వృద్ధురాలని చంపి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు. యువకుడు పంపిన వీడియో బెంగళూరులో వైరల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Related Posts
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...