పాక్ అథ్లెట్ కు ఆహ్వానం.. నీరజ్ చోప్రా ఆవేదన
పాకిస్థాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌ను భారత్ కు ఆహ్వానించడంపై భారత జావెలిన్ హీరో నీరజ్ చోప్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పహల్గాం ఘటన నేపథ్యంలో పాక్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పాక్ అథ్లెట్‌ను ఆహ్వానించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మే నెలలో బెంగళూరు వేదికగా ఎన్సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ జరగనుంది. ఈక్రమంలో తనపై వస్తున్న విమర్శలకు నీరజ్ చోప్రా రెస్పాన్డ్ అయ్యారు. చోప్రా కూడా ఆర్మీకి చెందిన వ్యక్తి కావడం ఇప్పుడు హైలెట్ అవుతుంది. ఈ సందర్భంగా తన కుటుంబం పైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.
ఈ క్రమంలో నీరజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నేను తక్కువగా మాట్లాడతా. అలాగని తప్పు అని భావించిన వాటికి వ్యతిరేకంగా మాట్లాడను అనే అర్థం కాదు. దేశంపై నా ప్రేమ విషయానికొస్తే ఏమాత్రం వెనకడుగు వేయను. అలాగే నా కుటుంబంపై గౌరవంగా ఉంటా. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌కు అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించడంపై చాలామంది నాపై కామెంట్స్ చేశారు. అందులో చాలావరకు అసభ్యకరమైనవి ఉన్నాయి. వారు నా కుటుంబాన్ని కూడా వదల్లేదు. నేను అథ్లెట్‌గానే అర్షద్‌ను ఆహ్వానించాను తప్పా, ఇందులో మరే ఉద్దేశం లేదు అన్నారు. అలాగే ఇదంతా సోమవారానికి ముందే జరిగింది. పహల్గాంలో ఉగ్రదాడికి ముందే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత 48 గంటల్లో చాలా మార్పులు జరిగాయని అన్నారు.