ధోనిపై సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By Ravi
On
ధోనిపై సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడం దాదాపు కష్టమే. తొమ్మిది మ్యాచుల్లో కేవలం రెండే విజయాలు సాధించిన సీఎస్కే.. మిగిలిన ఐదు గెలిచినా నాకౌట్‌ కు వెళ్తుందని చెప్పడం కష్టమే. అయితే, వేరే టీమ్స్ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందనేదే ప్రజంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనిమీద మాజీ క్రికెటర్ సురేష్ రైనా కామెంట్ చేశారు. ధోనీ ఉన్నా.. మిగతా క్రికెటర్లు రాణిస్తేనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. అయితే, ధోనీ ఎప్పుడూ వేలంలో పాల్గొనేవాడు కాదని గుర్తు చేశాడు. కాశీ సర్‌కు అడ్మినిస్ట్రేషన్‌కు 30ఏళ్లకుపైగా అనుభవం ఉంది. రూపా మేడమ్‌కు క్రికెట్ వ్యవహారాలు, ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేయాలి, గ్రూప్‌ను ఎలా నిర్వహించాలనే విషయాలపై పట్టు ఉంది. అయితే, ఈసారి మాత్రం సరైన సెలెక్షన్స్ చేసినట్లు అనిపించలేదని అన్నారు. 

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిజాయతీగా చెప్పాలంటే.. నేను ఎప్పుడూ వేలం ప్రక్రియకు హాజరుకాలేదు. అలాంటి చర్చల్లో భాగం కాలేదు. నేనెప్పుడైనా సరే రిటైన్‌ చేసుకున్న ప్లేయర్ల గురించే మాట్లాడేవాడిని. ధోనీ కూడా తన నిర్ణయం ఏంటో చెప్పేవాడు. అంతేకానీ, వేలంలో ఎప్పుడూ భాగం కాలేదు. కోర్ గ్రూప్‌లోని సభ్యులే ఆక్షన్‌లో పాల్గొంటారు. ధోనీ ఇలాంటి వేలానికి హాజరుకాడు. ఓ నలుగైదుగురు పేర్లను మాత్రమే సూచిస్తాడు. ఎవరిని రిటైన్‌ చేసుకోవాలో చెబుతాడు. 43 ఏళ్ల వయసులో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధోనీ కష్టపడుతుంటే.. మిగతా పది మంది ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు.

Advertisement

Latest News