శర్వానంద్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్..
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన కెరీర్‌లో 38వ సినిమాని దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ సర్కిల్స్‌తో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వారు అనౌన్స్ చేశారు.
ఆమెకు సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమా స్టోరీ పీరియాడిక్ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ కథను చాలా సాలిడ్ గా సంపత్ నంది ప్రిపేర్ చేసారని అంటున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో శర్వా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.