స్టార్ హీరోకు మరోసారి బెదిరింపులు..

By Ravi
On
స్టార్ హీరోకు మరోసారి బెదిరింపులు..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ కి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కార్‌ని పేల్చేస్తామని, వర్లిలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. ఈ బెదిరింపుల్లో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు. ఈ సంఘటన తర్వాత వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ప్రస్తుతం అధికారులు ఎవరు ఈ మెసేజ్ చేశారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులే ఎదుర్కొన్నారు. 

ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని హతమార్చేందుకు ఎన్నో సార్లు రెక్కీ కూడా నిర్వహించింది. దీంతో ఆయనకు ప్రాణహాని ఉండటంతో ప్రభుత్వం ఆయన సెక్యూరిటీని కూడా పెంచింది. 1998లో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉందని లారెన్స్ బిష్ణోయ్ ముఠా సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసింది. బిష్ణోయ్ కమ్యూనిటీకి ఎంతో ఆరాధ్యమైన కృష్ణజింకను చంపినందుకు పగ పెంచుకున్నారు. 2024లో, సల్మాన్ ఖాన్ ఒక ఆలయాన్ని సందర్శించి, కృష్ణ జింకల హత్యకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి కొత్త బెదిరింపు వచ్చింది. అక్టోబర్ 30న, నటుడిని గుర్తు తెలియని వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తూ మళ్ళీ బెదిరించాడు. మరి ఈ విషయంపై సల్మాన్ ఎలా రెస్పాన్డ్ అవుతారో చూడాలి.

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్