బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ అప్డేట్స్ తో సంయుక్త మీనన్..

By Ravi
On
బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ అప్డేట్స్ తో సంయుక్త మీనన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్‌ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి  మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత మరోసారి డెవిల్‌ కోసం కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది. బట్  బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. 2023 లో వచ్చిన డెవిల్ తర్వాత కనిపించకుండా పోయింది సంయుక్త. గతేడాది సంయుక్త నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఇప్పుడు సంయుక్త భారీగా ప్లాన్ చేస్తుంది.

వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది.  ప్రజెంట్ సంయుక్త చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో మూడు మైథాలజీతో లింక్ ఉండేవి కావడం గమనార్హం. నిఖిల్ సిద్దార్థ్‌‌తో చేస్తోన్న స్వయంభు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైంధవ, బాలకృష్ణ అఖండ 2 తాండవం మైథాలజీ డ్రామాకు చెందిన సినిమాలుగా తెలుస్తోంది. ఇవే కాకుండా శర్వానంద్ కు జోడీగా నారీ నారీ నడుమ మురారీతో పాటు హిందీలో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ అనే మూవీ చేస్తోంది. ఇక శర్వానంద్ మూవీ ఈ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమాలన్నీ సంయుక్తని టాప్ పొజిషన్ లో నిలబెట్టాలని కోరుకుందాం.

Tags:

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్