జూలైలో సాలిడ్ కమ్ బ్యాక్ తో రానున్న హీరోలు
ప్రజంట్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరికొన్ని సమ్మర్ తర్వాత రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సో జూలై నెలలో చాలావరకు పెద్ద హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయరు. కానీ ఈ సారి జూలైలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమాని జూలై 24 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీస్ కాస్త బోల్తా పడటంతో నెక్ట్స్ మూవీపైనే అంచనాలు పెట్టుకున్నారు. దీంతో విశ్వంభరతో సాలిడ్ హిట్ ఇవ్వాలని అనుకుంటున్నారు.
ఇక రవితేజ తను నటించిన మాస్ జాతర ప్రాజెక్ట్ ను జూలై 18 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన లాస్ట్ మూవీస్ అన్నీ వరుస ఫ్లాపులు అవ్వడంతో ఈ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక హీరో నితిన్ కూడా రీసెంట్ గా రాబిన్ హుడ్ తో యావరేజ్ సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేస్తుండగా జూలై 4 న సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూడు మూవీస్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.