గుడివాడ రైల్వేస్టేషన్‌ను జల్లెడ పట్టిన పోలీసులు..!
By Ravi
On
గుడివాడ రైల్వేస్టేషన్‌లో రైల్వేతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మచిలీపట్నం నుంచి వచ్చిన బాంబ్ డిక్టేటింగ్ పార్టీతో కలిసి ప్రత్యేకంగా సోదాలు నిర్వహించారు. రైళ్లలో జరుగుతున్న దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రోన్ కెమెరాలతో గుడివాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గుడివాడ రైల్వే ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. రైళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృష్ణాజిల్లా లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టూ టౌన్ సీఐ నాగ ప్రసాద్, గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ షరీఫ్, గుడివాడ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్, గుడివాడ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భగవాన్ నాయక్ పాల్గొన్నారు
Tags:
Latest News
28 Apr 2025 17:33:34
కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 2500కోట్లను పంపించారని కేటీఆర్ ఆరోపించారని అనుచిత వ్యాఖ్యలు చేసి...