బట్టతల మీద వెంట్రుకలంటూ ఇన్ స్టాలో ప్రచారం.. ఇద్దరి అరెస్ట్

By Ravi
On
బట్టతల మీద వెంట్రుకలంటూ ఇన్ స్టాలో ప్రచారం.. ఇద్దరి అరెస్ట్

పాతబస్తీలో గుండు మీద వెంట్రుకలు మొలిపిస్తాము అంటూ బిగ్ బాస్ సెలూన్ ఘటన మరిచిపోక ముందే ఉప్పల్ లో మరో ఇద్దరు ఇదే తరహాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇన్ స్టాలో ఆయిల్, షాంపూ వాడితే బట్టతల మీద వెంట్రుకలు గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారు. ఇంకేముంది జనం ఉప్పల్ భగాయత్ లోని స్టాల్ వద్ద క్యూ కట్టారు. వచ్చిన వారి దగ్గర రూ.700 వసూలు చేసి ఆయిల్ రాయడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మొద్దని మరోసారి తెలిపారు.

Tags:

Advertisement

Latest News