పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల?
స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న పెద్ది మూవీపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్లాన్ చేస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ కంప్లీట్ రగడ్ లుక్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా సినీ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ మూవీలో మాస్ మసాలా సాంగ్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీలీల కిస్సిక్ సాంగ్ తో రీసెంట్ గా పుష్ప మూవీలో నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే పుష్ప 2 మూవీలో ఈ బ్యూటీ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ దక్కింది. దీంతో ఇప్పుడు బుచ్చిబాబు మళ్లీ తన మూవీలో శ్రీలీలతో సాలిడ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రజంట్ చాలా సెలెక్టివ్ గా స్టోరీస్ ను లైన్ లో పెడుతున్న శ్రీలీల మరోసారి రామ్ చరణ్ కోసం స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేస్తుందా అనేది చూడాలి. ఇక ప్రజంట్ శ్రీలీల భారీ లైనప్ తో రెడీ అయ్యింది. ఈ సినిమాలన్నీ క్లిక్ అయితే ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకున్నట్లే.