రెట్రోకి సాలిడ్ ఓపెనింగ్స్ దక్కినట్లేనా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీనే రెట్రో. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య చాలా రోజులుగా ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రెట్రో మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్స్ బేస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అయితే ఉన్న హైప్ లో మాత్రం డే 1 కి మంచి వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది.
ముఖ్యంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెట్రో మంచి నెంబర్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. పి ఆర్ లెక్కల ప్రకారం రెట్రో చిత్రం 17.75 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో సూర్య కెరీర్లో ఇది మరో బెస్ట్ ఓపెనింగ్ అన్నట్టు తమిళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డే 2 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సూర్య, జ్యోతికలు ప్రొడ్యూస్ చేశారు.