వారికి ఐపీఎల్ లో మళ్లీ చోటు..

By Ravi
On
వారికి ఐపీఎల్ లో మళ్లీ చోటు..

ఐపీఎల్ 2025 సంవత్సరానికి క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టుల లిస్ట్ లో భారత క్రికెట్ బోర్డు ఈరోజు ప్రకటించింది. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్‌ కోల్పోయిన స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌ కు మళ్లీ చోటు దక్కింది. మరోవైపు రీసెంట్ గా అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డికి బీసీసీఐ కాంట్రాక్టులో ఛాన్స్ ఇచ్చింది. A+ గ్రేడ్‌లో నలుగురు, A గ్రేడ్‌లో ఆరుగురు, బి గ్రేడ్‌లో ఐదుగురు, సి గ్రేడ్‌లో 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ స్టార్స్ నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఫస్ట్ టైమ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు సంపాదించారు. 

అయితే వీరంతా సి గ్రేడ్‌లో ఉన్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ బి గ్రేడ్‌ నుండి A గ్రేడ్‌కు పదోన్నతి పొందాడు. A+ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను బీసీసీఐ వేతనంగా ఇవ్వనుంది. A గ్రేడ్‌లో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రిషభ్‌ పంత్ ఉన్నారు. వీరందరూ ఏడాదికి రూ.5 కోట్లు వేతనంగా పొందనున్నారు. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ బి గ్రేడ్‌లో కాంట్రాక్ట్ దక్కింది.

Advertisement

Latest News

నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..4.15కేజీల గంజాయి స్వాధీనం నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..4.15కేజీల గంజాయి స్వాధీనం
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎస్టిఎఫ్ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ దాడులు నిర్వహించి మూడు కేసుల్లో 4.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు. ధూల్‌పేట్‌లో శీలబాయి అనే...
గంజాయి.. డ్రగ్స్ పై ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఆపరేషన్ సింధూర్.. ఆల్విన్ కాలనీలో సంబరాలు
ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రపంచ నేతల రియాక్షన్ ఇదే..
పోప్‌ ఎన్నికకు రంగం సిద్ధం కానుంది..
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత