గిల్ కామెంట్స్ పై అజయ్ జడేజా ఫైర్..

By Ravi
On
గిల్ కామెంట్స్ పై అజయ్ జడేజా ఫైర్..

ఐపీఎల్ చరిత్రలో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు రాజస్థాన్ టీమ్ నుండి ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అదరగొట్టాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి సెంచరీ కంప్లీట్ చేశాడ. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ రంగంలోని అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్ దిగ్గజాలు సైతం వైభవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి తర్వాత గుజరాత్ టీమ్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వైభవ్ పై చేసిన వ్యాఖ్యలు గిల్ ను చిక్కుల్లో పడేశాయి. వైభవ్ ది జస్ట్ లక్ అంటూ గిల్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా అసహనం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. టీవీలో కొంతమంది ఆటగాళ్ళు వైభవ్ సెంచరీని కేవలం అదృష్ట దినం అని పిలుస్తున్నారు. 14 ఏళ్ల పిల్లాడు తనపై తాను నమ్మకం ఉంచుకుని, చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. 

నాకు ఇది తెలిసినప్పటికీ అతడిది లక్ అని అనడం సరైనది కాదు అని చురకలు అంటించారు. మనమందరం 14-15 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడాలని కలలు కన్నాము. అలాంటి ఇన్నింగ్స్‌ లను ఊహించాం.. కానీ ఈ యువకుడు ఆ కలను నిజం చేసుకున్నాడు. అతని బలం, అతని సమయం, అతని ప్రశాంతత, అదే నన్ను ఆశ్చర్యపరిచింది. అతని సెంచరీ చాలా కాలం గుర్తుండిపోతుందని అన్నాడు. వైభవ్ వయసు 14 సంవత్సరాల 32 రోజులు. అతను ఈ లీగ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా యూసుఫ్ పఠాన్ 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2010లో, యూసుఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్ పై 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. టోర్నమెంట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. ప్రస్తుతం వైభవ్ పై సర్వత్రా ప్రశంసలు తలెత్తుతున్నాయి.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్