టీమిండియాకు ఐసీసీ ఫైన్..
శ్రీలంక వేదికగా జరుగుతున్న స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా వుమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఫైన్ విధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 రూల్ ని బ్రేక్ చేసిందని.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయలేకపోవడంతో మ్యాచ్‌లో ఐదుశాతం జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇందుకు అంగీకరించిందని పేర్కొంది. కాగా కొలంబోలో జరిగిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక మహిళల జట్టు 38.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత జట్టు 29.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 149 పరుగులు చేసి మరో 56 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను విన్ అయ్యింది. ఆఫ్ స్పిన్నర్ రాణా 31 పరుగులకు 3 వికెట్లు తీయగా.. ఎడమచేతి వాటం స్పిన్నర్ చరణిని 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్ల పడగొట్టింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ కూడా 5.1 ఓవర్లలో 22 పరుగులకు రెండు వికెట్లు తీసింది. ఈ సిరీస్ లోని సెకండ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత జట్టు 15 పరుగుల తేడాతో ఓడించింది. ఇక నిన్న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ప్రతీకా రావల్ అర్ధ సెంచరీ రాణించడంతో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.