పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన భారత్ ఆపరేషన్..

By Ravi
On
పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన భారత్ ఆపరేషన్..

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ కు ఇండియన్ ఆర్మీ ఘాటైన ఆన్సర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. ఈ దాడులు పాకిస్తాన్ తో పాటు పీఓకేలో ఉగ్రస్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లు ఆర్మీ తెలిపింది. కాగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 200కి పైగా విమానాలు రద్దు చేశారు. శ్రీనగర్‌తో సహా కనీసం 18 విమానాశ్రయాలలో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాసా ఎయిర్, కొన్ని విదేశీ విమానయాన సంస్థలు వివిధ విమానాశ్రయాలకు తమ సేవలను రద్దు చేసుకున్నాయి. 

దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో కనీసం 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఆమెకు వివరించారు. కాగా.. ఆపరేషన్ అనంతరం ప్రధానమంత్రి అధ్యక్షత కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్