ముంబై టీమ్ పై తిలక్ వర్మ కామెంట్స్ వైరల్..
తాజాగా ముంబై టీమ్ క్రికెటర్ తిలక్ వర్మ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ముంబై ఇండియన్స్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ తెలిపాడు. తాను 2022లో ముంబై జట్టులో చేరా అని, అప్పటి నుంచి తాము ట్రోఫీని గెలవలేదన్నాడు. వ్యక్తిగతంగా గత మూడు సీజన్‌లు బాగానే సాగాయని, జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు మాత్రం రాలేదన్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయర్లకు సపోర్ట్ గా ఉంటాడని, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని తిలక్ చెప్పుకొచ్చాడు.
కాగా ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ 8 మ్యాచ్‌ల్లో 231 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తిలక్ వర్మ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ మన చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చేస్తాడు. వికెట్ల మధ్య పరుగెత్తుతున్నప్పుడు మా మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అతని ముఖంలో అస్సలు ఆందోళన కనిపించదు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో 19వ ఓవర్ వేసినప్పుడు కూడా నెట్స్‌లో బౌలింగ్ చేసినట్లు నాకు అనిపించింది. బుమ్రా భాయ్ అద్భుతం అని తిలక్ వర్మ పొగిడారు.