ఘ‌నంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు 

By Ravi
On
ఘ‌నంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు 

రంగారెడ్డి /రాజేంద్రనగర్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో సిబిఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను టీఎన్జీవోస్ జీహెచ్ఎంసీ పార్క్‌ లో నిర్వహించారు. దీనిలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తమ దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్ర అభివృద్ధికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారన్నారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రైతుల సంక్షేమం వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి మరపురానిదని తెలిపారు. యువతకు మార్గదర్శకుడిగా ఆయన ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలో బండారి యాదగిరి కాశీగారి యాదగిరి, యంజాల మహేష్ రాజు, ఏర్వ సత్యనారాయణ, తిరుమల వెంకటేష్, కుంకుల్లా దత్తు, శివ, నారాయణ, బాస శ్రీనివాస్, మహిపాల్, సీతారాం పాండు, గట్టయ్య, శేఖర్ గౌడ్, కొండల్, మహేందర్, ప్రభాకర్ గౌడ్, సంతోష్ గౌడ్, మధు, మునిగిపాటి వెంకటేష్, స్వామి గౌడ్, దేవేందర్, వడిగాచర్ల మల్లేష్, శరణమ్మ, పుష్ప, గౌతమి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

హయత్ నగర్ లో భూవివాదం.. కత్తులు రాళ్లతో దాడి.. నలుగురికి గాయాలు హయత్ నగర్ లో భూవివాదం.. కత్తులు రాళ్లతో దాడి.. నలుగురికి గాయాలు
హాయత్ నగర్ లో భూవివాదం నెలకొంది. రెండు వర్గాలు కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలు అయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ సర్వే...
చిలుకూరు అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన రాఘవరెడ్డిపై దాడి.. తీవ్రగాయాలు
గొర్రెల స్కాంలో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ అరెస్ట్
జొరదుకున్న మిస్ వరల్డ్2025 ఏర్పాట్లు.. హైదరాబాద్ కి చేరుకున్న విదేశీ ప్రతినిధులు
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు