సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య

By Ravi
On
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై  నుండి దూకి వివాహిత ఆత్మహత్య

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.  సుభాష్ నగర్ లో  వివాహిత లక్ష్మీ  (25) ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంటు పై నుండి దూకి ఘాతుకానికి పాల్పడింది.డిసెంబర్ 14 2024 లో హరికృష్ణ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది.  వీరి స్వస్థలం శ్రీకాకుళం. ప్రస్తుతం సుభాష్ నగర్ లో బంధువుల ఇంట్లో ఉంటోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపధ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:

Advertisement