అమ్మ జన్మ ఇస్తే.. ఫైర్ సిబ్బంది పునర్జన్మ ఇచ్చారు

By Ravi
On
అమ్మ జన్మ ఇస్తే.. ఫైర్ సిబ్బంది పునర్జన్మ ఇచ్చారు

మంటల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడిన ఫైర్ సిబ్బందిని జనం అభినందనలతో ముంచెత్తారు. అఫ్జల్ గంజ్ గోల్ మసీదు సమీపంలోని ఓ భవనంలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నారు. ఇరుకైన ఆ బస్తీలోకి వెళ్లడం చాలా కష్టం అయ్యింది. అప్పటికే ఆ మూడో అంతస్తు నుండి రక్షించండి అంటూ కేకలు వినపడుతున్నాయి. చుట్టూ వున్న జనం చూస్తుండిపోయారు తప్ప చేసేది ఏమిలేదు. ఎలాగోలా స్పాట్ కి వచ్చిన ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లో ఉన్న నలుగురిని సురక్షితంగా ప్రాణాలు కాపాడారు. బాధితుల్లో 80ఏళ్ల వృద్ధురాలితో పాటు, నెలలు నిండని పసికందు ఉంది. మంటలు సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్లిన సిబ్బంది వారికి ఎలాంటి చిన్న గాయం కాకుండా బయటకి తీసుకు వచ్చారు. ఫైర్ సిబ్బంది సాహసాల వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జనం, నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు. అమ్మ జన్మ ఇస్తే ఫైర్ సిబ్బంది పునర్జన్మ ఇచ్చారంటూ బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి
జీహెచ్‌ఎంసీలో 24 బార్ల దరఖాస్తులకు అధికారులు మార్గదార్శకాలు చేశారు. జూన్‌ 6న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు స్వీకరణ గడువు ఉందని,  జూన్‌ 13న ఉదయం...
పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు
ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కి యత్నం.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్