హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు

By Ravi
On
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు

టాలీవుడ్ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.  జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద  రాంగ్ రూట్లో కార్ తో దూసుకు వచ్చాడు.  ఈ గమనించి అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లినందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. మరోపక్కన ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ లో వచ్చిన ఆయనకు భారీగా జరిమానా విధించారు.

Tags:

Advertisement

Latest News

ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్ సి. హరి కిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొత్త డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం చేపట్టిన ఎన్‌పీడీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ మంచి ఫలితాలను ఇచ్చాయి. వారం...
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు
ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కి యత్నం.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్
మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్