కస్టమర్లను నమ్మించి బంగారంతో వ్యాపారి పరార్
By Ravi
On
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జువెలర్స్ పేరిట ప్రగతి నగర్ లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్దకు వచ్చే కస్టమర్లను నమ్మించి బంగారు ఆభరణాలు, స్కీమ్స్ అంటూ నమ్మించాడు. అలా సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలతో పరారయ్యాడు. ఈనెల 10వ తేదీ నుంచి షాప్ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అవసరానికి తమ బంగారం తాకట్టు పెట్టమంటూ లబోదిబో మన్నారు.
Tags:
Latest News
15 May 2025 18:40:11
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందించారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు...