ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..!
ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత లొంక నర్సింహులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గ్రీన్ సిటీ కాలనీలో ఎల్‌ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో.. శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో.. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సరైన చికిత్సలు చేయించుకోవాలన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 117మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని.. 16 మందిని కంటి ఆపరేషన్లు నిమిత్తం హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రికి తరలించి.. ఆపరేషన్లు చేయించిన అనంతరం తాండూర్‌కి తీసుకురావడం జరుగుతుందని ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు తెలిపారు. ఈ శిబిరంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అమీర్ అబ్దుల్లా, ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.