హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!

By Ravi
On
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!

హెచ్‌సీయూలో చెట్ల నరికివేత వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరణ చేయాలని.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా..? లేదా..? స్పష్టంగా చెప్పండని ప్రశ్నించింది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయాయని.. ఆ వీడియోలు చూసి ఆందోళనకు గురయినట్లు చెప్పుకొచ్చింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినందుకు చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీని కాపాడాలనుకుంటే.. 100 ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పండంటూ ప్రశ్నించింది. చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే.. ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి అందులోకి పంపిస్తామంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేసింది. తాము చెప్పే వరకు హెచ్‌సీయూ భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని ఆదేశించింది తీర్పు ఇచ్చాక కూడా హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు ఎందుకు ఉన్నాయంటూ జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి. 4.64కేజీల గంజాయి స్వాధీనం నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి. 4.64కేజీల గంజాయి స్వాధీనం
ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్  ఎస్టిఎఫ్ టీములు నాలుగు కేసుల్లో 4.64 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐడిఏ బొల్లారం పటాన్ చెరువు ప్రాంతంలో  ఎస్ టి ఎఫ్...
తిరుమలలో నమాజ్ కలకలం...
పునాధులతో సహా తొలగించిన హైడ్రా
మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్