Hcu వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, టీచర్స్ పై పోలీసుల లాఠీఛార్జ్
Hcu వద్ద మరోసారి నెలకొన్న టెన్షన్.. ర్యాలీ చేపట్టిన టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులపై లాఠీఛార్జ్
HCU వద్ద మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంసి. జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గా వెళుతున్న టీచర్స్, స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ భంగ్య నాయక్, టీచర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పిల్లల రాములు, స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ ల ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. యూనివర్సిటీ లోపల జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని, లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ ను తక్షణమే బయటకు పంపి వేయాలని, అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థుల ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ hcu వద్దకు చేరుకోగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీనితో మరోసారి యూనివర్సిటీ వద్ద టెన్షన్ నెలకొంది.