పెరుమాళ్‌ వెంకన్న మహాకుంభాభిషేకం..!

By Ravi
On
పెరుమాళ్‌ వెంకన్న మహాకుంభాభిషేకం..!

హైదరాబాద్‌ మోండా డివిజన్‌లోని పెరుమాళ్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేకంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. 40 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభాభిషేకం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఎంతో వైభవంగా నిర్వహించిన పూజలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ చైర్మన్ నర్సా రెడ్డి ఆధ్వర్యంలో తలసానిని సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, రాములు, మహేష్ యాదవ్, కిషోర్ కుమార్, జయరాజ్, ఆలయ సభ్యులు నరేందర్ రెడ్డి, గోవిందన్, నరేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News