ముంబై టీమ్ మ్యాచ్ లో అనంత్, రాధిక..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, చిన్న కోడలు రాధికా మర్చంట్ మరోసారి వైరల్ గా మారారు. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో వీరిద్దరూ స్టేడియంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్ కు నీతా అంబానీ ఓనర్ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అంబానీ ఫ్యామిలీ కచ్చితంగా హాజరవుతూ ఉంటుంది. తాజాగా అనంత్, రాధిక జంట ముంబై టీమ్ కు మద్దతు తెలిపేందుకు మ్యాచ్‌కు హాజరైంది. ఆ సమయంలో ఈ జంట గ్యాలరీలో పక్కపక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
వారిద్దరికి సంబంధించిన క్యూట్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్‌ను కొందరు తమ కెమెరాల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా, చిన్నతనం నుంచే స్నేహితులైన అనంత్, రాధిక గతేడాది జులైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం దాదాపు ఆరు నెలలు జరిగిందనే చెప్పాలి. ప్రీ వెడ్డింగ్, పార్టీలు, పూజలు అంటూ ఏడాదంటా వీరి వెడ్డింగ్ గురించే ప్రపంచం అంతా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.