ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..

By Ravi
On
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫాలో అవుతున్న డిపోర్టేషన్‌ విధానంపై ఇతర దేశాల్లోనే కాకుండా అగ్రరాజ్యంలోనూ వ్యతిరేకతలు వస్తున్నాయి. కిల్మార్‌ అబ్రెగో గార్సియా అనే వ్యక్తిని ట్రంప్‌ టీమ్ ఎల్ సాల్వెడార్‌కు బహిష్కరించిన విషయంపై తీవ్ర దుమారం రేగింది. ట్రంప్‌ నిర్ణయాలను ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఎల్ సాల్వెడార్‌కు బహిష్కరించిన కిల్మార్‌ అబ్రెగో గార్సియా ఎం-13 క్రిమినల్‌ ముఠాలో సభ్యుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటూ.. షేర్‌ చేసిన ఫొటో, మార్ఫింగ్‌ ఫొటో అని రాజకీయ ప్రత్యర్థులు వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు రెస్పాన్డ్ అయ్యారు. 

ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాలు కూడా ఈవిషయాన్ని ఒప్పుకున్నాయని, అమెరికాను గ్రేట్‌గా మార్చడానికే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నానన్నారు. దయచేసి తన పనిని తాను చేసుకోనివ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఇటువంటి హింసాత్మక ముఠా సభ్యుడికి మద్దతిస్తూ.. ప్రతిపక్ష డెమోక్రాట్లు అతడిని అమాయకుడిగా పేర్కొంటున్నారు. అతడు క్రూర స్వభావం కలవాడని.. భార్యని తీవ్రంగా కొట్టి హింసిస్తాడని..అధికారులు పేర్కొన్నారు. అవన్నీ దృష్టిలోపెట్టుకొని ఇటువంటి చెడు స్వభావం గల వ్యక్తులను అమెరికా నుంచి బహిష్కరిస్తూ.. దేశాన్ని మళ్లీ గొప్పగా చేయడానికి కృషి చేస్తున్నాను అని సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!