గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి

By Ravi
On
గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి

  • సీఎంఆర్‌ కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు 

మేడ్చల్ జిల్లా : సీఎంఆర్‌ కళాశాలలో బీటెక్‌ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్‌ సీఎంఆర్‌ కళాశాలలో బీటెక్‌ 4వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్‌ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్‌లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని హాస్పటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై, కన్నీరు మున్నీరు అయ్యారు.

Tags:

Advertisement

Latest News

అక్రమ ఔషధాలు సీజ్‌..! అక్రమ ఔషధాలు సీజ్‌..!
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....
వ్యక్తిపై బండరాయితో దాడి..!
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!
శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం..!