తీవ్ర విషాదం.. 148 మంది మృతి

By Ravi
On
తీవ్ర విషాదం.. 148 మంది మృతి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ తీవ్ర విషాదంలో నదిలో పడవ బోల్తా పడి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో నదిలో పడవ బోల్తా పడినప్పుడు మహిళలు, పిల్లలు సహా 500 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు స్థానిక అధికారులకు మీడియా నివేదికలు తెలిపాయి. మటాంకుము అనే ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరుతుండగా, హెచ్‌బి కొంగోలో అనే పడవలో ఎంబండకా పట్టణానికి సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు అప్రమత్తం అయ్యేలోపు దారుణం చోటు చేసుకుంది.

కాగా ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన దాదాపు 100 మందిని స్థానిక టౌన్ హాల్‌లోని టెంపరరీ ఆశ్రయానికి తరలించినట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులలో చేర్చారు. కాంగోలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాంగోలోని గ్రామాల మధ్య రవాణాకు పాత చెక్క పడవలు ఉపయోగిస్తుంటారు. దీంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2023లో, కాంగోలో ప్రయాణిస్తున్న పడవ ఈక్వేటర్‌లో మునిగిపోవడంతో కనీసం 47 మంది మరణించారు. కాగా ఈ ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది.

Related Posts

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!