స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి

By Ravi
On
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం TPN : మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా శనివారం సాలూరు మండల పరిషత్ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పైనే ఆధారపడి ఉంటుందని, వారు తమ పిల్లలను ప్రేమతో, శ్రద్ధతో పెంచాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అయినందున ప్రజలకు ఏవైనా అవసరాలు ఉంటే అవన్నీ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తామని తెలిపారు. ప్రతి మూడవ శనివారం ఇంటి పరిసరాలు, కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ-వ్యర్థాలను సేకరించి, వాటిని సురక్షితంగా రీసైకిల్ చేయడం ద్వారా సంపదగా మార్చి జిల్లాకు అదనపు ఆదాయాన్ని అందించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన స్వర్ణాంధ్ర – 2047 సంకల్పం ప్రకారం ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా ఒక థీమ్‌ ఆధారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!