కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌.. 

By Ravi
On
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌.. 

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లి సందడి జరిగింది. ఆయన కూతురు హర్షిత వివాహం తాజాగా నిన్న రాత్రి ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌ లో ఘనంగా జరిగింది. హర్షిత తన స్నేహితుడు సంభవ్‌ జైన్‌ ను కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అంతకు ముందు రోజు రాత్రి వీరి ఎంగేజ్మెంట్‌ సెరిమొనీని కూడా నిర్వహించారు. ఈ వేడుకు సందర్భంగా కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ తన భార్య సునీతతో కలిసి డ్యాన్స్‌ చేయడం హైలెట్ గా మారింది. 

కాగా ఈ క్రమంలో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమాలోని సూసేకీ పాట హిందీ వెర్షన్‌కు కేజ్రీవాల్‌ దంపతులు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక వివాహ వేడుకకు కేజ్రీవాల్‌ కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాలు తదితరులు హాజరయ్యారు. వేడుకలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కాగా వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

Latest News

పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..! పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!
- అమరావతిలో పవన్‌పై మోదీ స్పెషల్‌ కన్సర్న్‌ - పవన్‌కు చాక్లెట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ- ఏ వేదికైనా పవన్‌పై మోదీ స్పెషల్‌ ఇంట్రస్ట్‌- మోదీ కన్సర్న్‌...
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..