రాచకొండ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుండి రూ. 80లక్షల విలువ గల హాష్ ఆయిల్ స్వాధీనం

By Ravi
On
రాచకొండ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుండి రూ. 80లక్షల విలువ గల హాష్ ఆయిల్ స్వాధీనం

రాచకొండ పోలీసులు ఓ అంతర రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. భువనగిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్.ఓ.టి మల్కాజిగిరి, భువనగిరి లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర  ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన నాలుగు కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెట్ల శేఖర్, అనిమిరెడ్డి దుర్గారావులుగా గుర్తించారు. నిందితులు ఆయిల్ ఎవరెవరికి విక్రయించారు, వారి వెనుకాల ఎవరు ఉన్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.

Tags:

Advertisement

Latest News