మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు  నిందితులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్

By Ravi
On
మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు  నిందితులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్

జిల్లా యస్పీ శరత్ చంద్ర పవర్ ఐ‌పి‌ఎస్.

ఈ మద్య కాలములో నకిరేకల్ పట్టణ పరిధిలలో మోటర్ సైకిళ్ళ  వరుస దొంగతనాలు జరుగుతున్నందున నల్గొండ జిల్లా ఎస్‌.పి. శ్రీ శరత్ చంద్ర పవార్ IPS  ఆదేశాల మేరకు నల్లగొండ డి‌ఎస్‌పి శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో నకిరేకల్ సి.ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిన్నటి రోజు తేది 03.04.2025 న సాయంత్రం 5 గంటల సమయం లో నకరేకల్ పోలీసు స్టేషన్  ఇన్స్పెక్టర్  రాజ శేఖర్, యస్.ఐ లచ్చి రెడ్డి,  PCs శ్రీను, సురేష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు లు 100 డయల్ సిబ్బంది తో నకరేకల్ టౌన్ లోని ఇందిరా గాంధి బొమ్మ చౌరాస్తా వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా, సాయంత్రం 6 గంటల సమయం లో ఒక ప్యాషన్ pro మోటార్ సైకిల్ TS 05 EP 6553 నెంబర్ గల దాని మీద (A-1) పాలడుగు అశోక్ మరియు ఇంకొక నెంబర్ ప్లేట్ లేని స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు (A-2 & A-3) తిప్పర్తి రోడ్ వైపు నుండి వస్తుండగా, అట్టి రెండు మోటార్ సైకిల్ల ను ఆపి డాక్యుమెంట్లు, లైసెన్స్ లను చూపమనగా, వారి వద్ద లేవని చెప్పినందున, మొదట మోటార్ సైకిల్ TS 05 EP 6553 ను E. Chalan App లో చెక్ చేయగా, ఇట్టి నెంబర్ గ్లామర్ మోటార్ సైకిల్ దిగా చూపించినది. బైక్ వేరే, నెంబర్ వేరే వుండగా అనుమానం వచ్చి వారిని విచారించగా అట్టి మోటార్ సైకిల్ నడుపుచున్న వ్యక్తి పాలడుగు అశోక్ తాను అట్టి మోటార్ సైకిల్ ను నకరేకల్ లో  దొంగతనం చేసినాడని, అట్టి మోటార్ సైకిల్ కు వున్న TS-05-ET-3097 నెంబర్ ప్లేట్ ను తీసి వేసి తన వద్ద వున్న Passion Pro మోటార్ సైకిల్ కి పరశురాములు యొక్క గ్లామర్ బైక్ నెంబర్ ప్లేట్ ను బిగించి ఎవరికి అనుమానం రాకుండా తిరుగుచున్నాడని, తాను మరియు ఏర్పుల పరశురాములు (A-2), బోడ సాయిరాం(A-3) లు ముగ్గురు కలిసి నకరేకల్ లో (9) కేసులు, సూర్యాపేట(01) కేసు, చౌటుప్పల్(01) కేసు , హయత్ నగర్(03) కేసులు , వనస్తలిపురం(01) కేసు, LB. నగర్(05) కేసులు, చైతన్యపురి (01) మిగతా రెండు మోటార్ సైకిల్ ల యొక్క వివరాలు తెలియ నందున కేసు  ఏరియాలలో (24) మోటార్ సైకిల్ లను హోటల్ ల ముందు, బార్ షాప్  ల ముందు మరియు ఇండ్ల ముందు పార్క్ చేసిన వాటిని పాత తాళం చెవి లతో లాక్ ఓపెన్ చేసి దొంగిలించుకొని పోయి వాటిలో కొన్నింటిని పరశురాములు మరియు సాయిరాంలు  (11) బైక్ లను వారికి తెలిసిన వారికి అమ్ముకున్నామని. మిగతా (13) బైక్ లను నిర్మాణం లో వున్న పాలడుగు అశోక్ ఇంటి వెనుకాల వద్ద దాచి పెట్టగా వాటిని తో పాటు వారి వద్ద నుండి మొత్తం (24) మోటార్ సైకిల్ లను నేరస్తుల నుండి స్వాదీన పర్చుకునీ,ఈరోజు నేరస్తులైన  A-1. పాలడుగు అశోక్, A-2. ఏర్పుల పరశురాములు మరియు A-3. బోడ సాయిరాం లను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపనైనది.

వారి వద్ద నుండి (24) మోటార్ సైకిల్ ల మొత్తం  విలువ రూ.18,20,000/- లు ,3 సెల్ ఫోన్ లు స్వాధీనం .

నేరస్తుల వివరాలు: 
A-1. పాలడుగు అశోక్  S/o  సోమయ్య, వ. 30 సం. లు, కులం: మాదిగ, వృత్తి: కూలి,  R/o SC  కాలని,   
         తాటికల్ రోడ్, నకరేకల్ టౌన్.
A-2. ఏర్పుల పరశురాములు S/o సామ్యేల్, వ. 32 సం. లు, కులం: మాదిగ, వృత్తి: JCB   డ్రైవర్, 
        R/o అక్కినెపల్లి గ్రామం, నార్కెట్ పల్లి మండలం. 
A-3. బోడ సాయిరాం  S/o ఎల్లయ్య, వ. 31 సం. లు, కులం: మాదిగ, వృత్తి: లారీ డ్రైవర్, R/o తిరుమలగిరి  గ్రామం, నార్కెట్ పల్లి మండలం.  

 ఈ దొంగతనాల కేసును నల్లగొండ డి‌ఎస్‌పి శివరాం రెడ్డి  పర్యవేక్షణలో నకిరేకల్ సి.ఐ రాజశేఖర్  ఆధ్వర్యంలో పట్టుబడి చేసిన  యస్.ఐ లచ్చి రెడ్డి,  PCs వెంకటేశ్వర్లు, శ్రీను, సురేష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు ను  జిల్లా యస్పీ గారు అభినందించారు. 

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..