ఆరు గంటల్లో రైల్వేస్టేషన్‌ నిర్మాణం?

By Ravi
On
ఆరు గంటల్లో రైల్వేస్టేషన్‌ నిర్మాణం?

ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ 3డీ టెక్నాలజీతో జపాన్ రిలేటెడ్ కంపెనీ కేవలం ఆరు గంటల్లోనే రైల్వేస్టేషన్ ను నిర్మించింది. సెరెండిక్స్ అనే కంపెనీ 3డీ ప్రింటెడ్ పార్ట్స్ ను ఉపయోగించి జపాన్ లో హట్సుషిమాలో ఆరు గంటల్లో రైల్వేస్టేషన్ ను కట్టారు. నైట్ లాస్ట్ ట్రైన్ వెళ్లిపోయి.. మార్నింగ్ ఫస్ట్ ట్రైన్ వచ్చే టైమ్ కి ఈ రైల్వేస్టేషన్ ను పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘనత సాధించిన కంపెనీగా సెరెండిక్స్ నిర్మాణ కంపెనీ నిలిచింది. వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ప్రకారం.. అరిడాలో ఉన్న రైల్వేస్టేషన్‌లో గంటకు మూడుసార్లు రైళ్లు ఆగుతాయి. 24 గంటలు అనేక రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ స్టేషన్‌ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో 100 చదరపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ప్రస్తుత స్టేషన్‌ను నిర్మించారు.

అయితే రైల్వేస్టేషన్‌ భవనం నిర్మించి.. తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఇంకా కొంత ఇంటీరియర్‌ పనితో పాటు టికెట్‌ యంత్రాలు మొదలైన పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ నిర్మాణాన్ని జులైలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఇలాంటి 3డీ నిర్మాణాల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని అధికారులు పేర్కోంటున్నారు.

Advertisement

Latest News

ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..  ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్.. 
ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ రాక తర్వాత గడ్డు కాలం నడుస్తుంది. ఇప్పటికే ఆయన నిర్ధేశించిన టారీఫ్ లతో సతమతమవుతున్నాయి ప్రపంచ దేశాలు. అయితే ఆయన స్వదేశంలోనూ ట్రంప్...
బిల్ గేట్స్ తో విడాకులపై మెలిందా కామెంట్స్..
ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్..
సీఎం హైజాక్‌ అయ్యారు : తేజస్వి యాదవ్‌
హీరో సైఫ్ అలీఖాన్ కేసులో ఊహించని ట్విస్ట్..
వివాహితులిద్దరి మధ్య శారీరిక సంబంధం నేరం కాదు: హైకోర్టు
ఢిల్లీలో మూడు రోజులు ఉంటే..? : నితిన్ గడ్కరీ