27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర

By Ravi
On
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర

హైదరాబాద్:-
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమై కోటి మీదగా ప్రధాన బైక్ ర్యాలీ ఉదయం 8 గంటలకు కర్మాంఘాట్ హనుమాన్ దేవాలయం నుండి కోటి మీదుగా తాడ్ బంద్ వీర హనుమాన్ దేవాలయం వరకు  పాల్గొనాలని తెలిపారు.
 తో కలిసి తాడ్ బంద్ వీర హనుమాన్ దేవాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్టు  విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ తెలిపారు.కర్మాన్ ఘాట్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు కూడా లక్షలాదిగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటారని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా  ప్రసాద వితరణ, మంచి నీటి ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.పోలీసు శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  కట్టుదట్టమైన ఏర్పాట్లు చేశారని, శోభాయాత్ర సాగే ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసి, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.ప్రతి సంవత్సరం లక్షలాది మందితో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వీర హనుమాన్ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని శశిధర్ రెడ్డి తెలిపారు.మతోన్మాద శక్తులకు భాగ్యనగర్ లో స్థానం లేదని హిందువులు అందరూ సంఘటితమై అత్యధిక సంఖ్యలో ఈ శోభాయాత్రలో పాల్గొనాలని శశిధర్ పిలుపునిచ్చారు.వందలాది మంది వాలంటీలతో యాత్రను విజయవంతం చేయడానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:

Advertisement

Latest News

హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు