ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..

By Ravi
On
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..

హైదరాబాద్: చిన్నపాటి వర్షం పడితే చాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇతర ప్రాంతాల పరిస్థితి దారుణంగా మారుతుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు నరకం అనుభవిస్తారు. రోజంతా ఆఫీస్ లో కష్టపడి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడిందో ఇక అంతే సంగతులు.. అందుకే సైబరాబాద్ పోలీసులు ఈ సారి ముందుగానే రెస్పాన్డ్ అయ్యారు. ఈ సారి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా  ట్రాఫిక్ సమస్యలపై  సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గజరావు భూపాల్, మరియు హెచ్‌ఎమ్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, IAS ఇతర అధికారులతో  సైబరాబాద్ సీపీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు పాల్గొని, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో వర్షాకాలంలో రవాణా సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించుకున్నారు. IMG-20250529-WA0126ముఖ్యమైన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అండర్‌పాస్ లు, ఫ్లైవోవర్లు, పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. ORR లో ప్రధాన ట్రాఫిక్ బాటిల్‌నెక్ ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల పరిశీలనకు ఆదేశాలిచ్చారు. నిర్దేశిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యూహాలపై చర్చించారు. పాదచారులు మరియు ద్విచక్ర వాహన డ్రైవర్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక సర్వీస్ రోడ్లను, ప్రత్యేక పాదచారి మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు.  ORR లో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే TGPA, నార్సింగి రోటరీలు, PVNR ఎక్స్ ప్రెస్‌వే వంటి కీలక రహదారులపై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులు అభివృద్ధి, పాదచారుల నడక మార్గ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు.    ట్రాఫిక్ సమస్యకు కారణమయ్యే డ్రైనేజ్ పనులు, రోడ్డు మరమ్మత్తులను తక్షణమే పూర్తి చేయాలని నిర్ణయించారు. 
ఈ సమావేశంలో  హెచ్‌ఎమ్‌డీఏ కార్యదర్శి ఉపేందర్  రెడ్డి, HGCL చీఫ్ జనరల్ మేనేజర్ పరమ్ జ్యోతి, హెచ్‌ఎమ్‌డీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇతర ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు, ఇతర హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Latest News