అఫిషీయల్.. హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఈ రోజు అట్లీతో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫిషియల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఎన్నో నెలలుగా ఈ క్రేజీ కాంబినేషన్ పై సాలిడ్ హైప్ ని క్రియేట్ చేశారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ సన్ పిక్చర్స్ వారు చేసిన అనౌన్స్ మెంట్ ఇప్పుడు అదరగొడుతుంది. మేకర్స్ ఓ సాలిడ్ అనౌన్స్ మెంట్ వీడియోని రివీల్ చేశారు. ఇది మాత్రం కంప్లీట్ గా ఎవరూ ఊహించని రీతిలో ఉంది. మెయిన్ గా ఇంటర్నేషన్ లెవెల్ లో హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ తో కలిసి మాట్లాడ్డం, అలాగే వాళ్లంతా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది.
అండ్ మోస్ట్ వైరల్ థింగ్ ఏంటంటే.. అల్లు అర్జున్ పై మోషన్ క్యాప్చర్ ప్రయోగాలు మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మూవీ గురించి హైప్ మాత్రమే కాదు ఆడియన్స్ అంచనాలకు మించి ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పుష్ప మూవీతో ఓ రేంజ్ లో అల్లు అర్జున్ హైప్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు అట్లీతో అంతకు మించి అనే రేంజ్ లో ఊహించని ప్రాజెక్ట్ పాన్ ఇండియా ముందుకు రాబోతుందని అర్థమవుతుంది.