హిట్ 3 ట్రైలర్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 కోసం ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే తెలిపింది.
ఇక లేటెస్ట్ గా ఈ ట్రైలర్ రిలీజ్ టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. హిట్ 3 ట్రైలర్‌ను ఏప్రిల్ 14న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ చెప్పింది. ఈ ట్రైలర్‌లో అర్జున్ సర్కార్ సృష్టించే రక్తపాతం ఎలా ఉంటుందో శాంపిల్ చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.