అక్రమంగా బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్స్ విక్రయాలు
By Ravi
On
దారుఢ్యం కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు మరియు క్యాప్సూల్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,80,000 విలువైన స్టాక్‌ని స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, హుమాయున్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గౌలిపురా ప్రాంతానికి చెందిన నజీర్, ఇమ్రాన్, ఇమ్రాన్ ఖాన్ ముగ్గరు కలిసి శరీర దారుడ్యం కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ విక్రయోస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. యువకులకు వీటిని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీరి నుంచి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ కొనుగోలు చేసిన వారి వివరాలు, నిందితులకు అందించిన వ్యాపారుల అడ్రస్సులు సేకరిస్తున్నారు.
Tags:
Latest News
08 Apr 2025 15:34:08
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, లక్నో జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది.
స్పెన్సర్ జాన్సన్ ఫైనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.