అమెరికాలో ఆర్థిక మాంద్యం..!

By Ravi
On
అమెరికాలో ఆర్థిక మాంద్యం..!

డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని ఇతర దేశాలపై టారిఫ్స్ విధించడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగా లేటెస్ట్ గా హ్యాండ్స్ ఆఫ్ నిరసనలు జరిగాయి. యూఎస్ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్స్ అమలులోకి వచ్చే ముందే, తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు అమెరికన్లు సూపర్ మార్కెట్స్ క్యూ కట్టారు. మరోపక్క జేపీ మోర్గాన్ చేజ్ & కో సీఈఓ జానీ డిమోన్ ట్రంప్ నియమాలకు వ్యతిరేకంగా లెటర్ రాశారు. ట్రంప్ కొత్త టారిఫ్స్ గురించి లెటర్ లో తన ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల అమెరికా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. 

అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వ్యాప్తంగా ధరల్ని పెంచే అవకాశంతో పాటు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయని, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే వాటి ధరలు పెరుగుతాయని విమరించారు. రీసెంట్ టైమ్స్ లో టారిఫ్ లో మార్పుల వల్ల ద్రవ్యోల్బణం పెంచే అవకాశం ఉంది. చాలా మంది మాంద్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అని ఆయన అన్నారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..