KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే

ఫైనల్ XI జాబితా విడుదల – కోల్‌కతాలో స్పెన్సర్ జాన్సన్‌ ఎంట్రీ

By Ravi
On
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే

  • ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, లక్నో జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది.
  • స్పెన్సర్ జాన్సన్ ఫైనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్‌ జరుగుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఫైనల్ టీమ్ లో ఒక మార్పు చేసింది. మోయిన్ అలీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు ప్లేస్ ఫిక్స్ చేసింది. లక్నో ఫైనల్ టీమ్ లో ఎలాంటి మార్పులు లేకుండానే గ్రౌండ్ లోకి దిగుతుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కోల్‌ కతా రెండింట్లో గెలిచి, మరో రెండు మ్యాచుల్లో ఓటమి పాలయ్యింది. ఆ టీమ్ అకౌంట్ లో నాలుగు పాయింట్స్ తో లిస్ట్ లో ఐదోస్థానంలో ఉంది. 

ఇక లక్నో జట్టు నాలుగు మ్యాచులు ఆడగా.. రెండు విజయాలు, రెండు ఓటములతో నాలుగు పాయింట్లు, +0.048 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉన్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లో క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేశ్‌ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ లు బరిలోకి దిగుతున్నారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..