లవ్ మ్యారేజ్.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు

By Ravi
On
లవ్ మ్యారేజ్.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు

ఈ మధ్య కాలంలో దేశంలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిపోయింది. భార్యభర్తలు చంపుకోవడం, వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని పిల్లల్ని కడతేర్చడం.. లేదా భార్యభర్తలు చిన్నచిన్న కారణాలతో విడిపోవడం.. ఇలా నిత్యం ఎన్నో దారుణాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఓ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపురలోని మైలపనహళ్లి గ్రామానికి చెందిన ఫాసియా, నాగార్జున ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాగా వీరిద్దరి మతాలు వేరు కావడం వల్ల పెద్దవాళ్లు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్ధరు పారిపోయి మార్చి 23 న పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 

ఆ తర్వాత వీరి ప్రేమ పెళ్లికి యువతి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. అయితే యువకుడి ఫ్యామిలీ ఒప్పుకుంది. వీరి సంసార జీవితం 15 రోజులు గడిచిన తర్వాత యువతి తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఎందుకంటే ఫాసియా మాతాంతర వివాహం చేసుకోవడంతో ఆమె తల్లి ఆరోగ్యం పాడయ్యిందని, అందుకే తాను తన పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పి పోలీసుల దగ్గర రాతపూర్వకంగా రాసి ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. దీంతో నాగార్జున ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని మరీ ఇలా మధ్యలోనే వెళ్లిపోడంతో షాక్ కి గురయ్యాడు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..