దుస్తులు విప్పించి.. మగాళ్లతో చెకింగ్.. ఎయిర్ పోర్ట్ లో దారుణం

By Ravi
On
దుస్తులు విప్పించి.. మగాళ్లతో చెకింగ్.. ఎయిర్ పోర్ట్ లో దారుణం

శృతి చతుర్వేది అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ కు అమెరికాలోని అలస్కా ఎయిర్ పోర్ట్ లో దారుణమైన సంఘటన ఎదురైంది. ఆమె పవర్ బ్యాంక్ కాస్త అనుమానంగా కనిపించే సరికి ఎయిర్ పోర్ట్ సెక్యురిటీ సిబ్బంది ఆమె విషయంలో దారుణంగా ప్రవర్తించారు. దాదాపు ఆమెను 8 గంటల పాటు ఎటు వెళ్లనివ్వకుండా బంధించేశారు. ఆమె వేసుకున్న బట్టల్ని కూడా విప్పించి ఏసీ గదిలో కూర్బోబెట్టారు. కనీసం వాష్‌ రూమ్‌కు కూడా వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేసి పోస్ట్ ను షేర్ చేసింది. అసలేం జరిగిందంటే.. శృతి చతుర్వేది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. చాయ్‌పానీ పేరుతో ఆమె ఒక పబ్లిక్‌ రిలేషన్‌ సంస్థను నడుపుతున్నారు. 

తాజాగా ఆమె తన పని మీద అమెరికాలోని అలస్కా ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. అక్కడ ఎయిర్ పోర్ట్ సెక్యురిటీకి పవర్ బ్యాంక్ విషయంలో డౌట్స్ క్రియేట్ అయ్యి ఆమెను నిర్బంధించారు. ఆమె వేసుకున్న వార్మ్ వేర్ ను తీపించేశారు. ఆ తర్వాత మహిళా సెక్యురిటీతో కాకుండా మేల్ సెక్యురిటీతోనే ఆమెకు చెకింగ్ చేపించారు. వాష్ రూమ్ కు వెళ్లాలని రిక్వెస్ట్ చేసినా కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ సంఘటన ఆమె జీవితంలో చేదు అనుభవంగా మిగిలిందని అన్నారు. ఒక అమ్మాయి విషయంలో ఇలాంటి ప్రవర్తన సరికాదని, ఖచ్చితంగా ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ను ట్యాగ్ చేసింది. మరి ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..