ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్

అణు ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ గట్టి హెచ్చరిక

By Ravi
On
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్

  • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశం అనంతరం, ట్రంప్ తేజ్‌గా స్పందించారు.
  • టెహ్రాన్‌తో చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని, లేదంటే తమ దేశం ప్రమాదంలో పడుతుందని ట్రంప్ అన్నారు. ట్రంప్ తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమావేశం అయ్యారు. తర్వాత మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌ కి వార్నింగ్ ఇచ్చారు. ఈ శనివారం టెహ్రాన్‌ తో ఉన్నతస్థాయి చర్చలు ఉంటాయని అన్నారు. ఈ మీటింగ్ లో చర్చలు గనుక విఫలమైతే పెద్ద ప్రమాదంలో పడినట్లేనని.. పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు. తాజాగా ట్రంప్.. ఇరాన్‌ ను హెచ్చరించారు. 

అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రెస్పాన్డ్ అవుతూ.. అమెరికాతో చర్చలు ఉంటాయని, అయితే ఆ చర్చలు పరోక్షంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ పరోక్ష చర్చలు ఒమన్‌లో జరగనున్నట్లు ఇరాన్ తెలిపింది. ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ తిరస్కరించారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..