నేడు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు..
శ్రీరామనవమి కారణంగా మార్చిన షెడ్యూల్ – ఏప్రిల్ 8న డబుల్ హెడర్
- ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా సోమవారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
- పంజాబ్ vs చెన్నై, కోల్‌కతా vs లక్నో మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం నేడు జరగనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సాధారణంగా రెండు మ్యాచ్ లను వీకెండ్స్ లో అంటే శని, ఆదివారాలు పెడుతూ ఉంటారు. మధ్యాహ్నం 3.30కు ఓ మ్యాచ్, రాత్రి 7.30కు మరో మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. డబుల్ హెడర్ మ్యాచ్‌ల రోజున క్రికెట్ ఫాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఐపీఎల్‌లో వీక్ స్టార్టింగ్ లో ఎప్పుడూ రెండు మ్యాచ్‌లు జరగలేదు. కానీ ఐపీఎల్ 2025లో ఫస్ట్ టైమ్ ఈరోజు ఏప్రిల్ 8 న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే.. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు ఒకే ఒక మ్యాచ్ ఉంది.
చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. అయితే ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వేడుకలు ఉన్న నేపథ్యంలో శోభాయాత్రకు, మ్యాచ్‌కు తగిన భద్రతను కల్పించలేమని బెంగాల్ పోలీసులు క్యాబ్ కు లెటర్ రాశారు. ఈ క్రమంలో మ్యాచ్ డేట్ ను మార్చాలని కోరారు. దాంతో బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లో మార్పు చేసింది. ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్.. నేడు జరగనుంది.