ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్..

By Ravi
On
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగారం స్మగ్లింగ్..

నేషనల్ లెవెల్ లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. గోల్డ్ స్మగ్లర్లు ఎలాంటి భయం లేకుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో అధికారులకు మస్కా కొట్టి మరీ బంగారాన్ని ట్రాన్ఫర్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చాలాసార్లు బంగారం పట్టుబడిన సంఘటనలు ఎన్నో నిత్యం జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ డిపార్ట్ మెంట్ లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ ఇరాక్ యువకుడి దగ్గర నుండి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

అయితే కస్టమ్స్ డిపార్ట్ మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇండిగో విమానం ద్వారా బాగ్దాద్ నుండి ఢిల్లీకి చేరుకున్న ఇరాకీ ప్రయాణికుడిని ఆపారు. ప్రయాణికుల లగేజీని ఎక్స్ రే స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పద ఫోటోలు గుర్తించబడ్డాయి. తర్వాత ఆ ప్రయాణికుడిని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ తో తనిఖీ చేసినప్పుడు.. అతని లగేజీ నుండి రకరకాల గోల్డ్ కలర్ లోహపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా వీటి మొత్తం బరువు 1203 గ్రాములు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం స్వచ్ఛత, విలువను తెలియజేయడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..